Chandrababu: పోలవరం ప్రాజెక్టును సందర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు

  • పనుల పురోగతిపై విహంగ వీక్షణం
  • అనంతరం అధికారులతో సమీక్ష
  • మధ్యాహ్నం అమరావతికి చేరుకోనున్న సీఎం

ఎన్నికలతో బిజీగా ఉండడం వల్ల పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై ఇన్నాళ్లు దృష్టిసారించని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం ప్రాజెక్టును సందర్శించారు. పనుల పరిస్థితిపై విహంగ వీక్షణం చేశారు. ఎన్నికల నియమావళి అడ్డు వస్తుందన్న వ్యాఖ్యల నేపధ్యంలో తొలుత కాస్త వెనుకడుగు వేసినా అటువంటి నిబంధన ఏదీ లేదని అధికారులు స్పష్టం చేయడంతో ఈరోజు ఉదయం ఆయన ప్రాజెక్టును సందర్శించారు. పనుల పురోగతిని పరిశీలించిన అనంతరం అధికారులతో సమావేశమయ్యారు.

 ఈ పర్యటన అనంతరం మధ్యాహ్నానికి సీఎం అమరావతి చేరుకుంటారు. అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గం ఓటింగ్‌ సరళి, పోలింగ్‌ రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నిర్వహిస్తున్న సమీక్షా సమావేశంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో మాట్లాడుతారు. ఈ సమీక్ష అనంతరం ఢిల్లీ బయుదేరి వెళ్లనున్నారు. వీవీ ప్యాట్ల లెక్కింపు రివ్యూ పిటిషన్‌పై వివిధ పార్టీల నేతలతో ఆయన సమావేశం కానున్నారు.

Chandrababu
polavaram
site seaing
amalapuram
  • Loading...

More Telugu News