Cricket: టీమిండియా సభ్యుడు కేదార్‌ జాదవ్‌కు గాయం!

  • పంజాబ్‌తో జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌లో గాయం
  • బౌండరీ ఆపే ప్రయత్నంలో పడిపోయిన మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌
  • చికిత్స అందిస్తున్న వైద్యులు

టీమిండియా మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్ కేదార్‌జాదవ్‌ గాయపడ్డాడు. త్వరలో ఇంగ్లండ్, వేల్స్ వేదికగా జరిగే ఐసీసీ ప్రపంచకప్‌కి ఎంపికైన జట్టులో కేదార్‌ సభ్యుడు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్‌ లీగ్‌ పోటీల్లో భాగంగా పంజాబ్‌తో జరిగిన మ్యాచ్ లో ఓ బౌండరీని ఆపే ప్రయత్నంలో కేదార్‌ గాయపడ్డాడు.

వెంటనే అతన్ని వైద్య సహాయం కోసం తరలించారు. వైద్యులు ఎక్స్‌రే తీసి పరిస్థితిని పరిశీలిస్తున్నారు. గాయం మరీ పెద్దది కాదని, సరైన విశ్రాంతి తీసుకుంటే ప్రపంచ కప్‌ ముందు కోలుకునే అవకాశం ఉందని వైద్యులు తెలియజేసినట్లు ఐపీఎల్‌ జట్టు కోచ్‌ స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ తెలిపారు. ఒకవేళ కేదార్‌ ఆడే పరిస్థితి లేకపోతే స్టాండ్‌ బై సభ్యులుగా ఉన్న అంబటి రాయుడు, రిషబ్‌ పంత్‌లలో ఒకరికి అవకాశం వస్తుంది.

Cricket
team india
kedar jadav
injred
  • Loading...

More Telugu News