Vijayawada: పెనుగంచిప్రోలులో బోల్తాపడిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు.. 30 మందికి గాయాలు

  • బస్సు యానాం నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఘటన
  • హైదరాబాద్-విజయవాడ రహదారిపై బోల్తా
  • ముగ్గురు చిన్నారుల పరిస్థితి విషమం

కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం నవాబుపేట వద్ద ఓ ప్రైవేటు బస్సు బోల్తా పడిన ఘటనలో 30 మంది గాయపడ్డారు. రమణ  ట్రావెల్స్‌కు చెందిన బస్సు యానాం నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న బస్సు ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా పడింది. గాయపడిన వారిలో పదిమంది వరకు చిన్నారులు ఉన్నట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన చిన్నారుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా మారడంతో వారిని విజయవాడ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Vijayawada
Krishna District
penuganciprolu
ramana travels
  • Loading...

More Telugu News