local polls: తెలంగాణలో ప్రారంభమైన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల తొలివిడత పోలింగ్
- 197 మండలాల్లో కొనసాగుతున్న ఓటింగ్
- 195 జెడ్పీటీసీ, 2097 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు
- 2 జెడ్పీటీసీ, 69 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం
తెలంగాణలో స్థానిక సంస్థలైన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు తొలివిడత పోలింగ్ ఈ రోజు ఏడు గంటలకు ప్రారంభమైంది. రాష్ట్రంలోని 197 మండలాల్లో ఎన్నికలు జరుగుతుండగా 197 జెడ్పీటీసీలకు, 2,166 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే రెండు జెడ్పీటీసీ, 69 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం కావడంతో 195 జెడ్పీటీసీ, 2097 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ మొదలయింది. సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరగనుంది.
మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన భద్రాద్రి, భూపాలపల్లి, మంచిర్యాల, ములుగు, ఆసిఫాబాద్‌లో మాత్రం సాయంత్రం నాలుగు గంటలకే పోలింగ్ ముగుస్తుంది. బ్యాలెట్ పేపర్ల ద్వారా నిర్వహిస్తున్న ఈ ఎన్నికల్లో జెడ్పీటీసీలకు పింక్ కలర్, ఎంపీటీసీలకు వైట్ కలర్ బ్యాలెట్ పత్రాలు రూపొందించారు. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంది.