Sadhvi pragya singh: ప్రజ్ఞ టీ షర్టు, జీన్స్ ధరించి తిరిగేవారు.. ఆమె సాధ్వి ఏంటి?: చత్తీస్‌గడ్ సీఎం భూపేశ్

  • చిన్నప్పటి నుంచీ ఆమెది నేర స్వభావమే
  • ఓ వ్యక్తిని కత్తితో కూడా పొడిచారు
  • ఇప్పుడేమో సన్యాసినంటూ చెప్పుకుని తిరుగుతున్నారు

భోపాల్ బీజేపీ అభ్యర్థి సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ చత్తీస్‌గఢ్‌లో ఉండే సమయంలో టీషర్టు, జీన్స్ ప్యాంటు ధరించి బైక్‌పై తిరిగేవారని, ఆమె సాధ్వి ఎలా అవుతారని చత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బఘేల్ అన్నారు. ఓ వ్యక్తిని ఆమె కత్తితో పొడిచిన విషయం కూడా అందరికీ తెలుసన్నారు. చిన్నప్పటి నుంచీ ఆమెది నేర స్వభావమేనన్నారు. మాలెగావ్ పేలుళ్ల కేసులో ఆమె నిందితురాలిగా ఉన్నారని, ప్రస్తుతం బెయిలుపై బయట ఉన్నారని అన్నారు.

ఇన్ని నేరాలు చేసిన వ్యక్తి నేడు తాను సన్యాసినంటూ చెప్పుకుని తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. అయితే, సీఎం వ్యాఖ్యలపై మధ్యప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు హితేశ్ వాజ్‌పేయి మండిపడ్డారు. సాధ్విపై వచ్చినవన్నీ తప్పుడు ఆరోపణలేనని కొట్టిపడేశారు. అవన్నీ నిరాధారమైనవని అన్నారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని అన్నారు.

Sadhvi pragya singh
Madhya Pradesh
bhopal
Chhattisgarh
Bhupesh baghel
  • Loading...

More Telugu News