West Bengal: మా కార్యకర్తలను బెదిరిస్తారా? కుక్కలను కొట్టించినట్టు కొట్టిస్తా: బీజేపీ నేత భారతీ ఘోష్

  • తృణమూల్ కార్యకర్తలపై భారతీ ఘోష్ ఆగ్రహం
  • యూపీ నుంచి వెయ్యి మందిని తీసుకొస్తా
  • మిమ్మల్నీ కుక్కలను కొట్టించినట్టు కొట్టిస్తా

తృణమూల్ కార్యకర్తలపై పశ్చిమ బెంగాల్ లోని ఘాతల్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి భారతీ ఘోష్ ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. ఆనంద్ పూర్ ప్రాంతంలో బీజేపీ కార్యకర్తలపై తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తల దాడికి పాల్పడ్డారని ఆరోపణ. దాడిలో గాయపడ్డ తమ కార్యకర్తలను పరామర్శించేందుకు ఆమె వెళ్లారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ‘ఓట్లు వేయొద్దంటూ మా కార్యకర్తలను బెదిరిస్తారా? బెదరించనివ్వండి. నేను కూడా యూపీ నుంచి వెయ్యి మందిని తీసుకొచ్చి మిమ్మల్ని కూడా కుక్కలను కొట్టించినట్టు కొట్టిస్తా’ అంటూ తృణమూల్ కార్యకర్తలపై నిప్పులు చెరిగారు. తమ కార్యకర్తలకు ఏది ఇస్తే అంతకు రెట్టింపు వడ్డీతో తిరిగి చెల్లిస్తానని, అప్పుడు, ఇళ్లకు తాళాలు వేసుకుని ఆ పార్టీ కార్యకర్తలు వెళ్లాల్సి వస్తుందని ఘాటు వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

West Bengal
trinamul
bjp
bharathi ghosh
  • Loading...

More Telugu News