Krishna District: వైసీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు నాపై నిరాధార ఆరోపణలు చేశారు: టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ

  • సత్సంబంధాల కోసమే ఆయన ఇంటికి వెళ్తానన్నా
  • నేను మీ ఇంటికి రావడం ఇబ్బందైతే మీరే రండి
  • తేదీ, సమయం మీరు చెబితే నేను సిద్ధంగా ఉంటా

ఏపీ టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తనను బెదిరిస్తున్నాడంటూ గన్నవరం వైపీసీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు, మరో నేత బాల వర్ధనరావులు పోలీసులకు ఇటీవల ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కలకలం రేపిన ఈ వ్యవహారంపై వల్లభనేని వంశీ ఎట్టకేలకు స్పందించారు. ఈ మేరకు ఫేస్ బుక్ వేదికగా ఓ బహిరంగ లేఖ రాశారు. యార్లగడ్డ వెంకట్రావు తనపై నిరాధార ఆరోపణలు చేశారని అన్నారు. వెంకట్రావు గన్నవరం రాక ముందు ఆయనకు రెండు పోలీస్ కేసుల విషయమై సాయం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఎన్నికలకు ముందు ఆయన ఎవరో తనకు తెలియదని, కొడాలి నాని ద్వారానే వెంకట్రావు తనకు తెలుసని తెలిపారు. సత్సంబంధాలను కొనసాగించేందుకే ఆయన ఇంటికి వెళ్తానని ఫోన్ చేశానని, అపాయింట్ మెంట్ కోసమే ఫోన్ చేశానని అన్నారు. అందుకే, తన అనుచరులను వెంకట్రావు ఇంటికి పంపానని చెప్పారు. ‘నేను మీ ఇంటికి రావడం ఇబ్బంది అయితే మీరే మా ఇంటికి రండి. తేదీ, సమయం మీరు చెబితే నేను సిద్ధంగా ఉంటాను’ అని పేర్కొన్నారు. తన గురించి ఆయన భయపడాల్సిన పని లేదని అన్నారు. ‘దేవుడున్నాడు.. అన్నీ ఆయనకు తెలుసు..అందరికీ ఆ దేవుడే న్యాయం చేస్తాడు’ అని వంశీ తన లేఖలో పేర్కొన్నారు.

<iframe src="https://www.facebook.com/plugins/post.php?href=https%3A%2F%2Fwww.facebook.com%2FVallabhaneniVamsi%2Fposts%2F2368805236699874&width=500" width="500" height="249" style="border:none;overflow:hidden" scrolling="no" frameborder="0" allowTransparency="true" allow="encrypted-media"></iframe>

Krishna District
Gannavaram
Telugudesam
vallabhaneni
  • Loading...

More Telugu News