sattenapalli: సత్తెనపల్లిలో బెట్టింగ్ ముఠా అరెస్టు.. కీలక నిందితుడు ఎంబీఏ విద్యార్థి!
- నలుగురు సభ్యుల క్రికెట్ బెట్టింగ్ ముఠా
- నిందితుల నుంచి రూ.22.16 లక్షలు స్వాధీనం
- పోలీసుల అదుపులో బెట్టింగ్ కు పాల్పడ్డ నిందితులు
ఏపీలోని సత్తెనపల్లిలో నలుగురు సభ్యుల బెట్టింగ్ ముఠాను అరెస్టు చేశారు. ఆన్ లైన్ ద్వారా క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడుతున్న ఈ ముఠా సభ్యులను సత్తెనపల్లిలో అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.22.16 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బెట్టింగ్ కు పాల్పడ్డ 226 మందిని అదుపులోకి తీసుకున్నారు. బెట్టింగ్ లకు పాల్పడ్డ విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించారు.
పట్టుబడ్డ విద్యార్థుల్లో ఏపీ, తెలంగాణతో పాటు కర్ణాటకకు చెందిన వారు కూడా ఉన్నట్టు గుంటూరు గ్రామీణ ఎస్పీ రాజశేఖర్ బాబు తెలిపారు. ఈ ముఠాలో కీలక నిందితుడు పసుపులేటి నాగార్జున అని, అతను ఎంబీఏ చదువుతున్నాడని చెప్పారు. ఈ ముఠా సభ్యులైన అవదీశ్ ప్రతాప్ సింగ్, అంకిత్ ద్వివేది, దివ్యాంషు సింగ్ లను అరెస్టు చేశామని అన్నారు. వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసిన నాగార్జున, అందులో 226 మందిని చేర్చుకున్నట్టు వివరించారు.