Hyderabad: ప్రజాకళాకారుడు ‘అరుణోదయ’ రామారావు మృతి

  • గుండెపోటుకు గురైన ‘అరుణోదయ’ రామారావు
  • ఆంధ్ర మహిళా సభ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి
  • రామారావు మృతిపై విప్లవ, ప్రజా సంఘాల సంతాపం

అరుణోదయ సాంస్కృతిక సంస్థ ప్రజా కళాకారుడు రామారావు గుండెపోటుతో మృతి చెందారు. హైదరాబాద్ లోని ఆంధ్ర మహిళా సభ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. నాలుగు దశాబ్దాల పాటు ప్రజా పోరాటాల్లో పాల్గొన్న ఆయన ‘అరుణోదయ’ రామారావుగా ప్రసిద్ధి. స్థానిక విద్యానగర్ లోని ప్రజా పంథా కార్యాలయానికి ఆయన మృతదేహాన్ని తరలించారు. కాగా, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ఏపీ అధ్యక్షుడిగా ఆయన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రామారావు మృతిపై అరుణోదయ సాంస్కృతిక సంస్థ కళాకారులు, విప్లవ, ప్రజా సంఘాలు తమ సంతాపం ప్రకటించాయి.

Hyderabad
arunodaya ramarao
heart attack
  • Loading...

More Telugu News