Andhra Pradesh: ఏపీలో ఏసీబీ అధికారిణికి వరకట్న వేధింపులు

  • ఏసీబీ అధికారిణి ప్రభావతికి వరకట్న వేధింపులు
  • శంకరశెట్టి కిరణ్, ప్రభావతిలది ప్రేమ వివాహం 
  • రూ.20 లక్షలు తీసుకు రావాలంటూ వేధింపులు

విజయవాడకు చెందిన అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారిణి పిడిక్కాల ప్రభావతికి వరకట్న వేధింపులు తప్పలేదు. శంకరశెట్టి కిరణ్, ప్రభావతి ప్రేమ వివాహం. గత నవంబర్ లో వీరి పెళ్లి జరిగింది. పెళ్లయిన తర్వాత కొన్ని రోజుల వరకూ బాగానే ఉన్న కిరణ్, ఆ తర్వాత నుంచి కట్నం కోసం వేధించడం ప్రారంభించాడు. రూ.20 లక్షలు తీసుకు రావాలంటూ వేధిస్తుండేవాడు. వేధింపులు తీవ్రతరం కావడంతో స్థానిక పెనమలూరు పోలీస్ స్టేషన్ లో పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

Andhra Pradesh
ACB
Prabhavati
shnaker shetty
  • Loading...

More Telugu News