Andhra Pradesh: అనారోగ్యంతో చనిపోయిన తండ్రి.. తట్టుకోలేక ప్రాణాలు విడిచిన కుమారుడు!

  •  కర్నూలు జిల్లాలో ఘటన
  • 10 రోజుల క్రితం తండ్రి బిసయ్యకు అనారోగ్యం
  • నిన్న రాత్రి తుదిశ్వాస విడిచిన బిసయ్య

తండ్రి చనిపోవడాన్ని ఓ యువకుడు తట్టుకోలేకపోయాడు. లోలోన కుమిలిపోతూ అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశాడు. పనులు చేస్తూనే ఒక్కసారిగా కుప్పకూలిపోయి ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని బసపురంలో బిసయ్య, శంకరమ్మ దంపతులు ఉంటున్నారు. వీరికి ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వీరిలో చిన్నకుమారుడు ఓబులేసు తల్లిదండ్రుల వద్దే ఉంటున్నాడు. ఈ క్రమంలో ఇటీవల బిసయ్య ఆరోగ్యం క్షీణించింది.

దీంతో ఆయన్ను 10 రోజుల క్రితం ఆసుపత్రిలో చేర్పించారు. అయితే ఆయన చికిత్స పొందుతూ నిన్న రాత్రి ప్రాణాలు కోల్పోయారు. దీంతో తండ్రి మరణాన్ని ఓబులేసు తట్టుకోలేకపోయాడు. బాధతో కుమిలిపోతూ గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. మరోవైపు తండ్రీకొడుకులిద్దరూ చనిపోవడంతో బసపురంలో విషాధ ఛాయలు అలుముకున్నాయి.

Andhra Pradesh
Kurnool District
son died
  • Loading...

More Telugu News