Telangana: వివాహితకు ఇంటి ఓనర్ కుమారుడి వేధింపులు.. కోరిక తీర్చాలని అసభ్య ప్రవర్తన!

  • ప్రతిఘటించిన బాధితురాలు
  • బెదిరించి పరారైన నిందితుడు
  • భర్త సాయంతో పోలీసులకు ఫిర్యాదు

తమ ఇంటిలో అద్దెకు దిగిన వివాహితపై ఇంటి యజమాని కుమారుడు కన్నేశాడు. ఎవ్వరూ లేని సమయంలో ఆమె దగ్గరకు వెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు. బాధితురాలు తీవ్రంగా ప్రతిఘటించడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో ఆమె భర్తతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదయింది. తెలంగాణలోని హైదరాబాద్ లో గత నెల 29న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

నగరంలోని శ్రీకృష్ణనగర్‌లో ఓ ఇంట్లో దంపతులు 6 నెలల క్రితం అద్దెకు దిగారు. అయితే ఇంటి యజమాని కుమారుడు అహ్మద్, అద్దెకు దిగిన వివాహిత(21)పై కన్నేశాడు. గత నెల 29న ఆమె ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో లోపలకు వెళ్లి తలుపు వేశాడు. అనంతరం తన కోరికను తీర్చాలని కోరాడు. ఇందుకు సదరు బాధితురాలు తిరస్కరించగా, ఆమెతో అహ్మద్ అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో బాధితురాలు ప్రతిఘటించింది.

ఈ విషయం బయటకు చెబితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బెదిరించిన అహ్మద్ అక్కడి నుంచి పరారయ్యాడు. ఇంటికి వచ్చిన భర్తకు జరిగిన ఘటనను బాధితురాలు వివరించింది. దీంతో వీరిద్దరూ కలిసి బంజారాహిల్స్‌ పోలీసులను ఆశ్రయించారు. దీంతో పరారీలో ఉన్న అహ్మద్ పై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Telangana
Hyderabad
sexual harssment
Police
  • Loading...

More Telugu News