Andhra Pradesh: జగన్ కాని జగన్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో!

  • తెలంగాణలో అచ్చం జగన్ లాంటి యువకుడు
  • హవభావాలతో జగన్ నే మైమరిపిస్తున్న వైనం
  • సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియో

సాధారణంగా మనుషులను పోలిన మనుషులు ప్రపంచంలో ఏడుగురు ఉంటారని చెబుతుంటారు. ఏడుగురి సంగతి ఏమో కాని క్రికెటర్లు, సినీనటులు రాజకీయ నేతలను పోలిన వ్యక్తులు మాత్రం మనకు అప్పుడప్పుడూ మీడియాలో కనిపిస్తూ ఉంటారు. తాజాగా వైసీపీ అధినేత జగన్ లా ఉన్న ఓ యువకుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాడు. జగన్ ప్రసంగాలకు అచ్చం ఆయనలాగే హావభావాలు పలికిస్తూ అదరగొట్టేస్తున్నాడు.

ఓ యాంగిల్ లో అచ్చం జగన్ లా ఉన్న ఇతని పేరు రమేశ్ అని తెలుస్తోంది. తెలంగాణలోని కరీంనగర్ జిల్లా గోదావరి ఖని ప్రాంతానికి చెందిన ఇతనికి జగన్ అంటే చాలా ఇష్టమనీ, అందుకే జగన్ లా హావభావాలు పలికిస్తూ వీడియో చేస్తుంటాడని ఆయన స్నేహితులు చెబుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ వీడియోను మీరూ చూసేయండి.<iframe src="https://www.facebook.com/plugins/video.php?href=https%3A%2F%2Fwww.facebook.com%2Fkarmuruvenkatreddy%2Fvideos%2F2377681342451045%2F&show_text=0&width=267" width="267" height="476" style="border:none;overflow:hidden" scrolling="no" frameborder="0" allowTransparency="true" allowFullScreen="true"></iframe>

Andhra Pradesh
Telangana
ys jagan
duplicate
  • Loading...

More Telugu News