YSRCP: ఒకే గ్రామంలో టీడీపీ, వైసీపీ అభ్యర్థులు... పోలీసులకు చిక్కులు!

  • యరగొండపాలెం పరిధిలోని కలనూతలలో రీపోలింగ్
  • ఒకేసారి ప్రచారానికి వచ్చిన సురేశ్, అజితారావు
  • ఇరు పార్టీల వాహనాలనూ సీజ్ చేసిన అధికారులు

ఏపీలో రీపోలింగ్ జరగనున్న యరగొండపాలెం నియోజకవర్గ పరిధిలోని పెద్దారవీడు మండలం కలనూతలలో ప్రచారం నిమిత్తం నిన్న ఒకేసారి టీడీపీ, వైసీపీ అభ్యర్థులు రావడంతో కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న ఆదిమూలపు సురేశ్, టీడీపీ తరఫున బరిలో ఉన్న అజితారావుతో పాటు, ఒంగోలు టీడీపీ ఎంపీ అభ్యర్థి శిద్ధా రాఘవరావు కూడా ఒకేసారి ప్రచారం నిమిత్తం వచ్చారు. ఇరు పార్టీలూ అనుమతులు తీసుకోకుండా ప్రచార రథాలను గ్రామంలోకి తేవడంతో పోలీసులు వాటిని సీజ్ చేశారు. ఈ సందర్భంగా అక్కడి ఎస్ఐ ప్రభాకర్ రావు, సురేశ్ కు మధ్య వాగ్వాదం కూడా జరిగింది. టీడీపీ, వైసీపీలకు చెందిన రెండు వాహనాలను సీజ్ చేసినట్టు ఆర్డీవో వెల్లడించారు.

ప్రధాన నాయకులంతా ప్రచారం నిమిత్తం ఒకేసారి గ్రామంలోకి రావడంతో పరిస్థితిని సరిదిద్దేందుకు పోలీసులకు తలకు మించిన పనైంది. ఇక అనుమతి లేకుండా వాహనాలను వాడటంపై అజితారావు, సురేశ్ లకు యరగొండపాలెం రిటర్నింగ్ అధికారి నోటీసులు ఇచ్చారు. ఇద్దరు అభ్యర్థులూ ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించారని ఆరోపిస్తూ, వివరణ ఇవ్వాలని ఆదేశించారు. తాము సీజ్ చేసిన వాహనాలను డీఎస్పీకి స్వాధీనం చేసినట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News