seetharam yechury: సీతారాం ఏచూరిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన రాందేవ్ బాబా

  • ఏచూరి మన పూర్వీకులను అవమానించారు
  • ఇది క్షమించదగినది కాదు
  • ఆయన కటకటాల వెనక్కి వెళ్లాల్సిందే

సీపీఎం  జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరిపై ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ పోలీసులకు యోగా గురువు రాందేవ్ బాబా ఫిర్యాదు చేశారు. హిందువులు అత్యంత పవిత్రంగా భావించే రామాయణ, మహాభారతాలను ఏచూరి అవమానించారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం మీడియాతో రాందేవ్ బాబా మాట్లాడుతూ, 'మన పూర్వీకులను అవమానించిన ఏచూరిపై ఫిర్యాదు చేశాం. ఇది ముమ్మాటికీ క్షమించదగినది కాదు. కటకటాల వెనక్కి ఆయన వెళ్లాల్సిందే. ఈ ఘటనపై లోతైన దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశాం' అని తెలిపారు. ఈ సందర్భంగా రాందేవ్ బాబాతో పాటు పలువురు సాధువులు కూడా ఉన్నారు.

హిందూ మతం హింసకు అతీతమైనది కాదని ఏచూరి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. రామాయణ, మహాభారతాల్లో ఉన్నదంతా హింసేనని అన్నారు. 

seetharam yechury
ramdev baba
ramayan
mahabharata
complaint
  • Loading...

More Telugu News