Andhra Pradesh: ఏపీ అధికారులు తప్పించుకున్నారని సంతోషపడ్డా.. సాయంత్రానికల్లా వెంటాడుతుందని ఊహించలేకపోయా!: ఐవైఆర్ సెటైర్లు

  • నిన్న మంత్రివర్గ సమావేశం నిర్వహించిన చంద్రబాబు
  • వెటకారంగా స్పందించిన బీజేపీ నేత
  • చంద్రబాబు వ్యాఖ్యలను ట్వీట్ చేసిన ఐవైఆర్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్న మంత్రివర్గ సమావేశం నిర్వహించడంపై బీజేపీ నేత, ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు వ్యంగ్యంగా స్పందించారు. పెను తుపాను ‘ఫణి’  దూరంగా వెళ్లిపోవడంతో ఏపీ, రాష్ట్ర అధికారులకు ముప్పు తప్పిపోయిందని తాను సంతోషపడ్డానని ఐవైఆర్ తెలిపారు.

కానీ ఈ తుపాను సాయంత్రానికల్లా మంత్రివర్గ సమావేశం రూపంలో అధికారులను వెంటాడుతుందని ఊహించలేకపోయానని వాపోయారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించిన మంత్రివర్గ సమావేశంపై ఈ మేరకు సెటైర్లు వేసిన ఐవైఆర్.. చంద్రబాబు వ్యాఖ్యలున్న ఓ వార్తాపత్రిక క్లిప్ ను తన ట్వీట్ కు జతచేశారు..

Andhra Pradesh
Chandrababu
Telugudesam
iyr
BJP
Twitter
phoni
  • Loading...

More Telugu News