priyanka chopra: ప్రియాంక చోప్రా సోదరుడి పెళ్లి ఆగిపోవడం ఇదే మొదటిసారి కాదు!

  • సిద్ధార్థ్ పెళ్లి ఆగిపోవడం ఇది రెండో సారి
  • 2014లో కనిక మాథుర్ తో నిశ్చితార్థం
  • కొన్ని కారణాల వల్ల ఇషితతో పెళ్లి ఆగిపోయింది 

బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా సోదరుడు సిద్ధార్థ్ చోప్రా పెళ్లి ఆగిపోయింది. ఈ విషయాన్ని ఆమె తల్లి మధు చోప్రా స్పష్టం చేశారు. సిద్ధార్థ్, ఇషిత ఇద్దరూ పెళ్లి వద్దనుకున్నారని ఆమె తెలిపారు. అయితే, దీనికి గల కారణమేమిటో మాత్రం ఆమె వెల్లడించలేదు. తన ప్రియురాలు ఇషితతో సిద్ధార్థ్ నిశ్చితార్థం కూడా జరిగిపోయింది. పెళ్లి తేదీ సమీపిస్తున్న తరుణంలో... పెళ్లి ఆగిపోయింది.

మరో ఆసక్తికరం విషయం ఏమిటంటే, సిద్ధార్థ్ పెళ్లి క్యాన్సిల్ కావడం ఇది రెండో సారి. 2014లో అప్పటి ప్రియురాలు కనిక మాథుర్ తో సిద్ధార్థ్ కు నిశ్చితార్థం జరిగింది. గోవాలో పెళ్లి చేయాలని భావించారు. కానీ, కొన్ని కారణాల వల్ల ఆ పెళ్లి కూడా జరగలేదు. మూడోసారైనా కలిసొస్తుందో, లేదో చూడాలి మరి.

priyanka chopra
siddharth chopra
marriage
cancel
madhu chopra
  • Loading...

More Telugu News