Andhra Pradesh: గుంటూరు-ఒంగోలు ప్యాసింజర్ రైలులో షార్ట్ సర్క్యూట్.. బోగీ మొత్తానికి కరెంట్ షాక్.. పలువురికి అస్వస్థత!

  • బాధితులను ఆసుపత్రికి తరలించిన రైల్వే అధికారులు
  • వేజెండ్ల స్టేషన్ వద్దకు రైలు చేరుకోగానే ఘటన
  • బోగీని తొలగించి మరో బోగీ అమర్చిన రైల్వే సిబ్బంది

ఆంధ్రప్రదేశ్ లోని ఓ ప్యాసింజర్ రైలులో ఈరోజు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ సంభవించింది. గుంటూరు నుంచి ఒంగోలుకు వెళుతున్న ప్యాసింజర్ డెము రైలులో ఈరోజు సాంకేతిక సమస్య తలెత్తింది. రైలు వేజెండ్ల స్టేషన్ కు వద్దకు చేరుకోగానే షార్ట్ సర్క్యూట్ జరిగి ఓ బోగీలో విద్యుత్ ప్రవహించింది.

ఈ ఘటనలో రైలులోని పలువురు ప్రయాణికులు విద్యుదాఘాతానికి లోనయ్యారు. వెంటనే చాలామంది ప్రయాణికులు రైలు బోగీ నుంచి దూకేశారు. కాగా, ఈ ఘటనలో గాయపడ్డ ప్రయాణికులను రైల్వే అధికారులు, పోలీసులు సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. ప్రమాదానికి గురైన బోగీకి అధికారులు తొలుత విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. అనంతరం రైలుకు మరో బోగీని జతచేసి పంపించివేశారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News