Mancherial District: బోస్టన్‌ లో మృతి చెందిన శ్రావణ్ మృతదేహం స్వస్థలానికి చేరిక!

  • రిచ్‌మండ్‌లో ఉన్నత విద్య అభ్యసిస్తున్న శ్రావణ్‌
  • ఈస్టర్‌ సందర్భంగా స్నేహితులతో కలిసి బీచ్‌కి
  • సముద్రంలో స్నానం చేస్తుండగా అల ఉద్ధృతికి కొట్టుకుపోయిన శ్రావణ్‌

ఈస్టర్‌ సందర్భంగా బీచ్‌లో సరదాగా గడుపుదామని వెళ్లి మృత్యుకౌగిలి చేరిన శ్రావణ్‌ మృతదేహం స్వస్థలానికి చేరుకుంది. తెంగాణలోని మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం అశోక్‌నగర్‌కు చెందిన శ్రావణ్‌కుమార్‌ అమెరికాలోని రిచ్‌మండ్‌లో ఉన్నత విద్య అభ్యసిస్తున్నాడు. గత నెల 22వ తేదీన బోస్టన్‌ బీచ్‌కి స్నేహితులతో కలిసి వెళ్లాడు. స్నానం చేస్తుండగా అలల ఉద్ధృతికి సముద్రంలోకి కొట్టుకుపోయి గల్లంతయ్యాడు. అతని స్నేహితులు ఇచ్చిన సమాచారం మేరకు స్థానిక అధికారులు గాలింపు చర్యలు చేపట్టి మరునాడు మృతదేహాన్ని వెలికి తీశారు. అనంతరం శ్రావణ్‌ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అక్కడి ఫార్మాలీటీస్‌ అన్నీ పూర్తయ్యాక శ్రావణ్‌ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

Mancherial District
bellampalli
USA
sravan dead body
  • Loading...

More Telugu News