Andhra Pradesh: విహారయాత్రకు వెళ్లిన గంటా శ్రీనివాసరావు.. స్విమ్మింగ్ పూల్ లో మనవడితో ఆటలు!

- టూర్లకు వెళ్లొచ్చిన చంద్రబాబు, జగన్
- కుటుంబంతో కలిసి గంటా ప్రయాణం
- ట్విట్టర్ లో ఫొటోలు పోస్ట్ చేసిన నేత
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాక రాజకీయ నేతలంతా విహారయాత్రలకు వెళుతున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు తన కుటుంబ సభ్యులతో కలిసి హిమాచల్ ప్రదేశ్ కు వెళ్లిరాగా, వైసీపీ అధినేత జగన్ తన ఫ్యామిలీతో కలిసి స్విట్జర్లాండ్ టూర్ కు వెళ్లివచ్చారు. తాజాగా ఏపీ విద్యాశాఖ మంత్రి టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు తన కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లారు.

