misses India telangana: మిసెస్స్‌ ఇండియా తెలంగాణగా కూచిపూడి డ్యాన్సర్‌ భావన ఎంపిక

  • మూడో రన్నర్‌గా నిలిచి మిసెస్స్‌ ఇండియా పోటీలకు అర్హత
  • భావన ఈ ఘనత సాధించిన తొలి విజయవాడ మహిళ
  • వివాహితులకు నిర్వహించిన పోటీల్లో 111 మందితో పోటీ

విజయవాడకు చెందిన మహిళ అరుదైన ఘనత సొంతం చేసుకున్నారు. మిసెస్స్ ఇండియా ఎంపిక కోసం నిర్వహించిన ప్రాథమిక పోటీల్లో మిసెస్స్‌ ఇండియా తెలంగాణగా విజయవాడకు చెందిన కూచిపూడి నాట్యకారిణి భావన ఎంపికయ్యారు. వివాహితుల కోసం నిర్వహించిన ఈ పోటీల్లో దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి మొత్తం 111 మంది  మహిళలు తుది ఎంపికలో పోటీపడ్డారు. వీరిలో భావన తెలంగాణ రాష్ట్రం నుంచి ఎంపికై మిసెస్స్‌ ఇండియా పోటీలకు అర్హత సాధించారు. భావన కూచిపూడి నాట్యంలో పట్టభద్రురాలు. ఈమె గౌరవ డాక్టరేట్‌తోపాటు రాష్ట్ర, జాతీయ స్థాయి అవార్డులు మరో 22 సొంతం చేసుకున్నారు. బాహుబలి చిత్రానికి కొరియోగ్రఫీ చేశారు. పదేళ్లపాటు పాత్రికేయ వృత్తిని కూడా చేపట్టారు.

misses India telangana
Vijayawada
kuchipudi
  • Loading...

More Telugu News