secunderabad: సికింద్రాబాద్-నాగ్‌పూర్ ప్యాసింజర్ రైలులో దోపిడీ

  • మందమర్రి సమీపంలోని నీలగిరితోట వద్ద ఘటన
  • రైలులోకి ప్రవేశించిన ఆరుగురు దుండగులు
  • ఆరు తులాల బంగారు ఆభరణాల చోరీ

సికింద్రాబాద్ నుంచి నాగ్‌పూర్ వెళ్తున్న ప్యాసింజర్ రైలులో దోపిడీ జరిగింది. మంచిర్యాల జిల్లా పరిధిలోని రవీంద్రగని, మందమర్రి రైల్వేస్టేషన్ల మధ్య శనివారం వేకువజామున రైలులోకి ఆరుగురు దుండగులు ప్రవేశించారు. అనంతరం చైను లాగి ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేశారు. ఇద్దరు మహిళల నుంచి ఆరు తులాల బంగారు ఆభరణాలను లాక్కెళ్లారు. మందమర్రి సమీపంలోని నీలగిరితోట దగ్గర ఈ ఘటన జరిగినట్టు బాధితులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. జీఆర్పీఎఫ్ పోలీసులు వెంటనే స్థానిక పోలీసులకు విషయం చెప్పి అప్రమత్తం చేశారు. డాగ్‌స్క్వాడ్‌తో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దుండగుల కోసం గాలిస్తున్నారు.

secunderabad
Nagpur
passenger rail
Mancherial District
  • Loading...

More Telugu News