Lakshmi's NTR: ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ప్రదర్శన ఫలితం.. కడపలో మూడు థియేటర్లు సీజ్

  • ఏపీలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ప్రదర్శనకు అనుమతి నిరాకరణ
  • ఈసీ ఆదేశాలను ఉల్లంఘించి ప్రదర్శించిన మూడు థియేటర్లు
  • జేసీ ఆదేశాలతో సీజ్ చేసిన అధికారులు

కడపలో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను ప్రదర్శించిన మూడు సినిమా థియేటర్లను రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఈ సినిమా విడుదలకు ఎన్నికల సంఘం నుంచి అనుమతులు లేనప్పటికీ కడపలోని రాజా థియేటర్, పోరుమామిళ్లలోని వెంకటేశ్వర థియేటర్,  రైల్వే కోడూరులోని ఏఎస్ఆర్ థియేటర్లలో ఈ సినిమాను ప్రదర్శించారు. విషయం తెలిసిన రెవెన్యూ అధికారులు థియేటర్ యజమానులను హెచ్చరించి వదిలేశారు.  

అయితే, ఈ విషయాన్ని మాత్రం ఎన్నికల సంఘం సీరియస్‌గా తీసుకుంది. సినిమా ప్రదర్శనను అడ్డుకోవడంలో విఫలమైన జాయింట్ కలెక్టర్‌పై చర్యలకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది సిఫారసు చేశారు. దీంతో అప్రమత్తమైన జేసీ కోటేశ్వరరావు థియేటర్లపై చర్యలకు ఆదేశించారు. ఆయన ఆదేశాలతో సినిమా ప్రదర్శించిన మూడు థియేటర్లను రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు.

Lakshmi's NTR
Kadapa District
Theatre
EC
Andhra Pradesh
  • Loading...

More Telugu News