Yadadri Bhuvanagiri District: హాజీపూర్ వరుస హత్యల ఘటనపై రంగంలోకి దిగిన క్లూస్ టీం

  • శ్రీనివాసరెడ్డికి 14 రోజుల రిమాండ్
  • వరంగల్ సెంట్రల్ జైలుకి తరలింపు
  • బావి వద్దకు వెళ్లిన క్లూస్ టీమ్

యాదాద్రి భువనగిరి జిల్లాలో వరుస హత్యలు సంచలనం రేపిన విషయం తెలిసిందే. హాజీపూర్‌లో ముగ్గురు విద్యార్థినుల హత్యోదంతానికి కారకుడైన శ్రీనివాసరెడ్డికి భువనగిరి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత నడుమ నిందితుడిని వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించారు. అయితే ఈ వరుస హత్యల ఘటనపై మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు క్లూస్ టీం రంగంలోకి దిగింది. ఏసీపీ భుజంగరావుతో కలిసి క్లూస్ టీమ్ వివరాలు సేకరిస్తోంది. నేడు విద్యార్థినులను హత్య చేసిన బావి వద్దకు క్లూస్ టీమ్ వెళ్లింది.

Yadadri Bhuvanagiri District
Hazipur
Srinivasa Reddy
Bhuvanagiri
Clues Team
  • Loading...

More Telugu News