Tharun Adarsh: ‘బాహుబలి 2’ వసూళ్లతో ఆ సినిమా వసూళ్లను అలా ఎలా పోలుస్తారు?: శోభు యార్లగడ్డ

  • హిందీ వసూళ్లను మాత్రమే తీసుకోవడం సరికాదు
  • అసలు సరైన పోలికలా అనిపించట్లేదు
  • ఈ కోణంలో విశ్లేషించడం సరికాదు

ఇటీవల విడుదలైన హాలీవుడ్ భారీ బడ్జెట్ చిత్రం ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’ వసూళ్లను ప్రముఖ సినీ విశ్లేషకుడు తరుణ్ ఆదర్శ్ ‘బాహుబలి 2’ వసూళ్లతో పోల్చడంపై నిర్మాత శోభూ యార్లగడ్డ అసంతృప్తి వ్యక్తం చేశారు. బాలీవుడ్‌లో తొలివారం వసూళ్ల పరంగా ముందున్న ఐదు సినిమాలను ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’తో పోల్చారు. ‘బాహుబలి 2’ (కేవలం హిందీ భాషలో రూ.247 కోట్లు), ‘సుల్తాన్‌’ (రూ.229.16 కోట్లు), ‘టైగర్‌ జిందాహై’ (రూ.206.04 కోట్లు), ‘సంజు’ (రూ.202.51 కోట్లు), ‘దంగల్‌’ (రూ.197.54 కోట్లు) రాబట్టాయని, ‘అవెంజర్స్‌: ఎండ్‌గేమ్‌’ రూ. 260.40 కోట్లతో వీటన్నిటినీ దాటేసిందని తరుణ్ ఆదర్శ్ ట్వీట్‌ చేశారు.

తరుణ్ ట్వీట్‌ని చూసిన శోభు యార్లగడ్డ, ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’ అన్ని భాషల వసూళ్లను తీసుకుని, ‘బాహుబలి 2’ విషయంలో కేవలం హిందీ వసూళ్లను మాత్రమే తీసుకోవడం సరికాదన్నారు. అసలు సరైన పోలికలా తనకు అనిపించట్లేదని, ప్రముఖ విశ్లేషకులైన తరుణ్ ఆ కోణంలో విశ్లేషించడం సరికాదని శోభు యార్లగడ్డ పేర్కొన్నారు. ‘బాహుబలి 2’ ఒక్క భాషా వసూళ్లను, ఎవెంజర్స్ సినిమా అన్ని భాషల వసూళ్లతో కలిపి చెప్పారని శోభు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News