Boyapati Sreenu: మరో హీరో కోసం మాస్ కథను సిద్ధం చేస్తోన్న బోయపాటి?

  • కేఎస్ రవికుమార్ తో బాలయ్య సినిమా
  • బోయపాటి హర్ట్ అయ్యాడంటూ టాక్
  • మరో హీరో కోసం కథ రెడీ చేస్తోన్న బోయపాటి   

బాలకృష్ణ కెరియర్లో చెప్పుకోదగిన చిత్రాల జాబితాలో బోయపాటి దర్శకత్వం వహించిన 'సింహా' .. 'లెజెండ్' కనిపిస్తాయి. ఎన్టీఆర్ బయోపిక్ తరువాత బోయపాటితో తన సినిమా ఉంటుందని బాలకృష్ణ ప్రకటించాడు. ఆ ప్రాజెక్టుకు సంబంధించిన కథపైనే బోయపాటి కసరత్తు చేస్తున్నాడు. నేడో .. రేపో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందని అంతా అనుకుంటూ ఉండగా, బాలకృష్ణ తదుపరి సినిమా కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో వుండనున్నట్టుగా ఒక వార్త బయటికి వచ్చింది.

చరణ్ తో బోయపాటి చేసిన 'వినయ విధేయ రామ' పరాజయంపాలు కావడమే బాలకృష్ణ మనసు మార్చుకోవడానికి కారణమనే టాక్ వచ్చింది. ఏదేమైనా బాలకృష్ణ నిర్ణయం బోయపాటిని చాలా హర్ట్ చేసిందట. దాంతో ఆయన కూడా మరో హీరోతో ముందుకు వెళ్లాలనే ఉద్దేశంతో, మాస్ అంశాలతో కూడిన ఒక కథను సిద్ధం చేసుకుంటున్నాడట. కథపై కసరత్తు పూర్తయిన తరువాత హీరో ఎవరనేది చెప్పే అవకాశం ఉందని అనుకుంటున్నారు.

Boyapati Sreenu
  • Loading...

More Telugu News