Andhra Pradesh: చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రావాలని వెయ్యి శాతం కోరుకుంటున్నా: సినీ నటుడు శివకృష్ణ

  • చంద్రబాబు ఓటమి పాలైతే విశ్లేషణలు చేయను
  • పీఎం అయ్యే అవకాశ శరద్ పవార్, బాబుకు  ఉన్నాయి
  • ఆ అవకాశమొస్తే బాబు వదులుకోరని అనుకుంటున్నా

ఏపీలో చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రావాలని వెయ్యి శాతం కోరుకుంటున్నానని సీనియర్ నటుడు శివకృష్ణ అన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఒకవేళ, ఈ ఎన్నికల్లో చంద్రబాబు ఓటమి పాలైతే కనుక విశ్లేషణలు ఎక్కువగా చేయనని చెప్పారు. ఈసారి, పీఎం అయ్యే అవకాశాలు శరద్ పవార్ కు, చంద్రబాబుకు ఉన్నాయని అన్నారు. చంద్రబాబుకు ఈసారి పీఎం అయ్యే అవకాశం వస్తే వదులు కోరని తాను అనుకుంటున్నానని అభిప్రాయపడ్డారు. దేశాన్ని బాగుచేసేందుకు ఓ మంచి వ్యక్తి రావాలని కోరుకునే వాళ్లలో తాను కూడా ఒకడినని చెప్పారు. మాఫియా వ్యక్తులు నాయకులు, మంత్రులు అయిపోయి ప్రజలపై పెత్తనం చలాయించడం పోవాలన్నదే తన కోరిక అని చెప్పారు.  

Andhra Pradesh
CM Ramesh
Chandrababu
siva krishna
Tollywood
Telugudesam
  • Loading...

More Telugu News