Andhra Pradesh: ఉత్తరాంధ్ర ప్రజలకు అండగా నిలవండి.. వైసీపీ శ్రేణులకు జగన్ పిలుపు!

  • బలమైన గాలులు, వర్షంతో ఫణి తుపాను బీభత్సం
  • శ్రీకాకుళం జిల్లా నేతలతో మాట్లాడిన జగన్
  • సమన్వయంతో కలిసి పనిచేయాలని సూచన

ఒడిశాతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలను ఫణి తుపాను వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పెను తుపాను(సైక్లోన్) ను ఎదుర్కొనేందుకు అధికారులు ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్ ఫణి తుపానుపై ఆరా తీశారు. వైసీపీ శ్రీకాకుళం జిల్లా నేతలు ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాస్‌, తమ్మినేని సీతారాం, కిల్లి కృపారాణితో పాటు పలువురితో మాట్లాడారు.

ఈ సందర్భంగా తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు అండగా నిలవాలని పార్టీ శ్రేణులకు సూచించారు. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలతో సమన్వయం చేసుకుని పనిచేయాలని కోరారు. మరోవైపు భీకరమైన గాలులకు టెక్కలిలోని అన్న క్యాంటీన్ షెల్టర్ ఎగిరిపోయింది. శ్రీకాకుళం జిల్లాలోని పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి.

Andhra Pradesh
phoni
cyclone
YSRCP
Jagan
Srikakulam District
  • Loading...

More Telugu News