YSRCP: వైసీపీ ఎమ్మెల్యే అనిల్ పై చంద్రబాబు కక్ష కట్టారు.. తప్పుడు కేసులతో వేధించారు!: గడికోట శ్రీకాంత్ రెడ్డి

  • ప్రజాస్వామ్యంపై బాబుకు నమ్మకం లేదు
  • చేయకూడని పనులన్నీ ఆయన చేస్తున్నారు
  • హైదరాబాద్ లో మీడియాతో వైసీపీ నేత

బాధ్యతాయుతమైన సీఎం పదవిలో ఉన్న చంద్రబాబు చేయకూడని పనులన్నీ చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. ప్రజలు, ప్రజాస్వామ్యంపై చంద్రబాబుకు ఎంతమాత్రం నమ్మకం లేదని విమర్శించారు. ప్రజలు తనకు ఓటు వేయలేదని తెలిసి కొత్తకొత్త పంథాలు అనుసరిస్తున్నారని దుయ్యబట్టారు.

కేసుల నుంచి తప్పించుకోవడం కోసం రకరకాల విన్యాసాలు చేస్తున్నారని ఆరోపించారు.  ‘సీఎస్ మనవాడు అయితే మంచివాడు.. కాకపోతే పనికిరాడు’ అనే రీతిలో బాబు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు జరిగిన మీడియా సమావేశంలో శ్రీకాంత్ రెడ్డి మాట్లాడారు.

వైసీపీ నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పై కక్ష పెంచుకున్న చంద్రబాబు నానా రకాలుగా ఇబ్బందులు పెట్టారని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. అందులో భాగంగానే క్రికెట్ బెట్టింగ్ చేశారని తప్పుడు కేసులో ఇరికించేందుకు ప్రయత్నాలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు అప్పటి డీజీపీని బదిలీ చేయాలని టీడీపీ ఫిర్యాదు చేయగానే మార్చారనీ, అప్పుడు వైఎస్ చిరునవ్వుతో హుందాగా వ్యవహరించారని గుర్తుచేశారు.

YSRCP
gadikota srikanth reddy
Chandrababu
Telugudesam
Nellore District
mla
anil kumar
  • Loading...

More Telugu News