Chandrababu: తుపాన్లు వస్తే పచ్చ చొక్కాలకు పండగే!... చంద్రబాబు కోట్ల విలువైన పనులు పంచేవాళ్లు: విజయసాయిరెడ్డి

  • నామినేషన్ పద్ధతిలో ప్రజాధనాన్ని పంచేవారు
  • కలెక్టర్లు పారదర్శకంగా నడుచుకోవాలి
  • అధికార యంత్రాంగం అవిశ్రాంతంగా కష్టపడింది

ఫణి తుపాను నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబుపై విమర్శనాస్త్రాలు సంధించారు వైసీపీ ముఖ్యనేత విజయసాయిరెడ్డి. తుపాన్లు వచ్చినప్పుడల్లా చంద్రబాబునాయుడు టీడీపీ నేతలకు విలువైన పనులను నామినేషన్ మీద ఇచ్చేసేవాళ్లని, ఆ విధంగా తనవారికి ప్రజధనాన్ని పంచిపెట్టేవారని ఆరోపించారు. తుపాన్లు వచ్చిన సమయాల్లో పంచిపెట్టిన పనుల విలువ కొన్ని కోట్ల రూపాయలు ఉంటుందని ట్వీట్ చేశారు.

అంతేగాకుండా, ఓటమి ఖాయమై పదవిలోంచి దిగిపోయే ముందు పదవికి అతిగా ఆశలు పెట్టుకున్న నాయకుడు, కోడ్ అమలులో ఉండగా సీఎస్ తో పెట్టుకున్నవాళ్లు మంచి పేరు తెచ్చుకున్నట్టు చరిత్రలో ఎక్కడా లేదని సినీ ఫక్కీలో మరో ట్వీట్ చేశారు.

ఈసారి అధికార యంత్రాంగం తుపాను సహాయక చర్యల్లో ఎంతో కష్టపడిందని, ఎలాంటి ప్రాణనష్టం లేకుండా ముందు జాగ్రత్తలు తీసుకున్నారని విజయసాయి కితాబిచ్చారు. ఎలాంటి ప్రచారం కోరుకోకుండా మూడు రోజుల పాటు అవిశ్రాంతంగా సహాయక చర్యలు చేపట్టారని అధికారులపై ప్రశంసల వర్షం కురిపించారు. ఫణి తుపాను తీరం దాటిన నేపథ్యంలో కలెక్టర్లు పారదర్శకంగా నడుచుకోవాలని సూచించారు.

  • Loading...

More Telugu News