Andhra Pradesh: చంద్రబాబు ఇంటి పక్కనే అగ్నిప్రమాదం.. మంటలను ఆర్పిన అగ్నిమాపక సిబ్బంది!

  • అమరావతిలోని సీఎం నివాసం వద్ద ఘటన
  • ఎండుగడ్డికి మంటలు.. పంటపొలాలకు వ్యాప్తి
  • అగ్నిప్రమాదంపై అధికారుల దర్యాప్తు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం వద్ద ఈరోజు అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అమరావతిలోని ఉండవల్లిలో కరకట్ట పక్కనే ఉన్న ఎండుగడ్డి తగలబడటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇవి పక్కనే ఉన్న పంటపొలాలకు కూడా వ్యాపించాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు అగ్నిమాపకశాఖ అధికారులకు సమాచారం అందించారు.

ఈ నేపథ్యంలో హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న అగ్రిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే, భారీ భద్రత ఉండే ముఖ్యమంత్రి నివాసం సమీపంలో మంటలు చెలరేగడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎవరైనా ఆకతాయిలు సిగరెట్, బీడీ వంటివి కాల్చి పడేయడంతో మంటలు చెలరేగాయా? అన్న విషయమై కూడా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

Andhra Pradesh
Chandrababu
house
Fire Accident
Police
  • Loading...

More Telugu News