jaqueline fernandez: ఎవరో చేసిన పనికి అమాయక ప్రజలు, పిల్లలు ఎందుకు బలి కావాలి?: జాక్వెలిన్ ఫెర్నాండెజ్

  • శ్రీలంకను ఆదుకునేందుకు అందరూ ముందుకు రావాలి
  • గాయపడ్డ శ్రీలంకను మామూలు స్థితికి తీసుకొద్దాం
  • మతం, జాతులను పక్కన పెట్టండి

శ్రీలంకలో ఉగ్రవాదులు జరిపిన నరమేధంలో 250 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ మారణహోమంపై బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఆవేదన వ్యక్తం చేసింది. పేలుళ్లతో అతలాకుతలమైన శ్రీలంకను అందరం కలసి ఆదుకుందామని పిలుపునిచ్చింది. జాక్వెలిన్ కూడా శ్రీలంక జాతీయురాలే అన్న విషయం తెలిసిందే.

ఎవరో ఉన్మాదానికి ఇంతమంది అమాయకులు, పిల్లలు ఎందుకు బలవ్వాలో తనకు అర్థం కావడం లేదని జాక్వెలిన్ ఆవేదన వ్యక్తం చేసింది. ఉగ్రదాడులను ప్రజలు ముందే పసిగట్టలేరని చెప్పింది. అందరం ఒక్కటైతే గాయపడ్డ శ్రీలంకను మళ్లీ మామూలు స్థితికి తీసుకురావచ్చని తెలిపింది. శ్రీలంకలో గాయపడ్డ బాధితులకు 'ట్రెయిల్' అనే స్వచ్ఛంద సంస్థ సాయం చేస్తోందని... ఆ సంస్థతో తాను ఒప్పందం కుదుర్చుకున్నానని వెల్లడించింది. మతం, జాతులను పక్కన పెట్టి అందరూ మానవత్వంతో ముందుకు రావాలని కోరింది.

  • Loading...

More Telugu News