Telangana: సైకిల్ గుర్తుకే ఓటేయాలన్న మాజీ మంత్రి ఉమామాధవరెడ్డి.. విస్తుపోయిన టీఆర్ఎస్ శ్రేణులు!

  • బొమ్మలరామారం ఎన్నికల ప్రచారంలో ఘటన
  • కుమారుడి తరఫున ఉమ ప్రచారం
  • వెంటనే తేరుకుని కారుకు ఓటేయాలని కోరిన టీఆర్ఎస్ నేత

టీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి ఎలిమినేటి ఉమామాధవరెడ్డి నోరు జారారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆమె.. కారుకు ఓటేయండి అని అడగాల్సింది పోయి సైకిల్ కే ఓటేయాలని కోరారు. వెంటనే తేరుకుని కారుకు ఓటేయాలని కోరారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని బొమ్మలరామారం జెడ్పీటీసీ అభ్యర్థిగా ఉమా మాధవరెడ్డి కుమరుడు సందీప్ రెడ్డి టీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో కుమారుడి తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఉమా, సైకిల్ గుర్తుకే ఓటేయాలని కోరారు. దీంతో టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఒక్కసారిగా విస్తుపోయారు. వెంటనే తేరుకున్న ఉమామాధవరెడ్డి కారు గుర్తుకే ఓటేయాలని కవర్ చేశారు. దీంతో టీడీపీని వీడినా, ఇంకా పాత అలవాట్లు పోలేదని పలువురు నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.

Telangana
Yadadri Bhuvanagiri District
elimineti
uma madhava reddy
TRS
Telugudesam
  • Loading...

More Telugu News