Andhra Pradesh: నా విశ్లేషణ కరెక్టు అయితే టీడీపీకి అన్ని స్థానాలు రావాలి: సీనియర్ నటుడు శివకృష్ణ

  • ‘పసుపు-కుంకుమ’, వృద్ధాప్య పెన్షన్ ప్రభావం ఉండొచ్చు
  • పథకాలు ఎప్పుడు ప్రవేశపెట్టారన్నది ముఖ్యం కాదు
  • ప్రజలకు ఉపయోగపడ్డాయా? లేవా? అన్నది ముఖ్యం

తన అంచనా ప్రకారం ఏపీలో చంద్రబాబు చేసిన అభివృద్ధి, తీసుకొచ్చిన సంక్షేమ పథకాలే ఆయన్ని గెలిపిస్తాయని సీనియర్ నటుడు శివకృష్ణ అన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు ప్రవేశపెట్టిన పథకాలు మొదట్లో తీసుకొచ్చారా లేక చివర్లో తీసుకొచ్చారా? అనే ప్రశ్నలు ఉపయోగం లేనివని అన్నారు. పథకాలు ఎప్పుడు ప్రవేశపెట్టారన్నది కాదు కావాల్సింది, ప్రజలకు ఉపయోగపడ్డాయా? లేవా? అన్నదే ముఖ్యమని స్పష్టం చేశారు.

‘పసుపు-కుంకుమ’, వృద్ధాప్య పెన్షన్ ల ప్రభావం ఉంటే, తాను చేసుకున్న విశ్లేషణ కరెక్టు అయితే టీడీపీకి 105 స్థానాలు రావడం ఖాయమని అన్నారు. ఒకప్పుడు గ్రాస్ రూట్ లో, గ్రౌండ్ లెవెల్ లో బాగా పనిచేయడంతో పాలిటిక్స్ పై తనకు కొద్దిగా పట్టు దొరికిందని చెప్పుకొచ్చారు. ఆ కామన్ సెన్స్ తోనే  2004లో ‘మనం ఓడిపోతున్నాం సార్’ అని చంద్రబాబుకు చెప్పానని గుర్తుచేసుకున్నారు. అప్పుడు, తాను చెప్పిన మాటలు ఎవరూ నమ్మలేదని, నమ్మినా నమ్మకపోయినా జరిగింది అదేనని అన్నారు. అలాగే, 2014లోనూ తాను చెప్పిందే జరిగిందని అన్నారు.

Andhra Pradesh
cm
Chandrababu
artist
siva krishna
Telugudesam
pasupu kumkumua
  • Loading...

More Telugu News