air india: మీడియాతో మాట్లాడవద్దు: ఉద్యోగులకు ఎయిర్ ఇండియా వార్నింగ్

  • ఏ ఒక్క ఉద్యోగి కూడా మీడియాతో మాట్లాడవద్దు
  • సంస్థకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టింగ్ లు చేయవద్దు
  • అధికారికంగా అనుమతులు ఉంటేనే మాట్లాడాలి

ఎవరూ కూడా మీడియాతో మాట్లాడవద్దని తన ఉద్యోగులకు ఎయిర్ ఇండియా యాజమాన్యం సీరియస్ గా వార్నింగ్ ఇచ్చింది. యూనిఫామ్ ధరించి సంస్థకు వ్యతిరేకంగా మీడియాతో పలువురు ఉద్యోగులు మాట్లాడిన సందర్భాలను గమనించామని, ఇకపై ఇలాంటి వాటికి ముగింపు పలకాలని హెచ్చరించింది.

యూనిఫామ్ వేసుకుని మీడియాతో మాట్లాడిన సన్నివేశాలు వివిధ ఛానళ్లలో ప్రసారమయ్యాయని, సోషల్ మీడియాలో కూడా కంపెనీ గురించి చెడుగా మాట్లాడిన వీడియోలను పెడుతున్నారని ఎయిర్ ఇండియా డైరెక్టర్ అమృత శరణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంస్థకు చెడ్డ పేరును తీసుకొచ్చే ఇలాంటి చర్యలకు దూరంగా ఉండాలని ఉద్యోగులను మరోసారి కోరుతున్నానని చెప్పారు. యాజమాన్యం నుంచి అనుమతులు తీసుకోకుండా ఏ ఒక్క వ్యక్తి కానీ, వ్యక్తుల సమూహం కానీ, ఉద్యోగులు యూనియన్ కానీ మీడియాతో మాట్లాడకూడదని తెలిపారు.

air india
employees
media
ban
  • Loading...

More Telugu News