Blast: జార్ఖండ్ లో అమిత్ షా ర్యాలీ నేపథ్యంలో... బీజేపీ కార్యాలయాన్ని పేల్చేసిన మావోలు!

  • కర్సనాల్ బీజేపీ కార్యాలయం పేల్చివేత
  • అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో ఘటన
  • ఇక్కడి నుంచి పోటీలో ఉన్న మాజీ సీఎం అర్జున్ ముండా

భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా నేడు జార్ఖండ్ లో పర్యటించనున్న నేపథ్యంలో సారైకేలా జిల్లా, కుంతీ లోక్ సభ పరిధిలోని కర్సవాన్ లోని బీజేపీ కార్యాలయాన్ని మావోయిస్టులు పేల్చి వేశారు. గత అర్థరాత్రి 12.30 గంటల సమయంలో పార్టీ కార్యాలయం వద్దకు వచ్చిన మావోలు, కేన్ బాంబులను ఉపయోగించి పార్టీ ఆఫీస్ ను పేల్చి వేశారు. కుంతి నుంచి జార్ఖండ్ మాజీ సీఎం అర్జున్ ముండా బీజేపీ తరఫున పోటీలో ఉన్నారు. కుంతితో పాటు కోడెర్మా, రాంచీ నియోజకవర్గాల్లో నేడు అమిత్ షా ఎన్నికల ర్యాలీలను నిర్వహించాల్సి వుంది. ఐదో విడత ఎన్నికల్లో భాగంగా 6వ తేదీన ఇక్కడ పోలింగ్ జరగనుంది.

Blast
BJP
Office
Naxals
Kunthi
Amit Shah
  • Loading...

More Telugu News