Narendra Modi: ప్రధాని మోదీపై పోటీ చేస్తున్న విశాఖపట్టణం యువకుడు

  • మోదీపై పోటీ చేస్తున్న మానవ్
  • ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ
  • స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి

ప్రధానమంత్రి నరేంద్రమోదీపై పోటీ చేస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నుంచి మోదీ పోటీ చేస్తున్నారు. రైతులపై మోదీ ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ తెలంగాణలోని నిజామాబాద్‌కు చెందిన 40 మంది పసుపు, ఎర్రజొన్న రైతులు వారణాసిలో నామినేషన్ వేసేందుకు వెళ్లారు. చివరికి ఎలాగోలా 25 మంది రైతులు నామినేషన్ వేసినా 24 మంది రైతుల నామినేషన్‌ను అధికారులు తిరస్కరించారు. దీంతో ఒకే ఒక్క రైతు బరిలో మిగిలాడు.

ఇక విశాఖపట్టణానికి చెందిన ఓ యువకుడు కూడా మోదీపై పోటీ చేస్తున్నాడు. నగరంలోని విశాలాక్షి నగర్‌కు చెందిన మానవ్ ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగాడు. గత నెలలో ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ మానవ్ పోటీ చేశాడు. విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్‌గానే పోటీ చేశాడు.

Narendra Modi
Visakhapatnam District
manav
Nizamabad District
farmers
  • Loading...

More Telugu News