cyclene fani: ఏపీలో తీరం దాటిన ఫణి తుపాను.. కొనసాగుతున్న భారీ వర్షాలు
- ఒడిశా దిశగా పయనం
- గోపాల్‌పూర్-చాంద్‌బలీ మధ్య మరో గంటలో తీరం దాటనున్న ఫణి
- సోంపేటలో అత్యధికంగా పది సెంటీమీటర్ల వాన
మూడు రాష్ట్రాల ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న ఫణి తుపాను ఏపీలో తీరం దాటి ఒడిశాలోకి ప్రవేశించింది. గోపాల్‌పూర్-చాంద్‌బలీ మధ్య ఈ ఉదయం 10:30-11:30 గంటల మధ్య తీరం దాటుతుందని ఆర్టీజీఎస్ అధికారులు తెలిపారు. అయితే, తుపాను ఇంకా తీవ్రంగానే ఉన్నట్టు పేర్కొన్నారు.
దీని ప్రభావంతో శ్రీకాకుళంలో భారీ వర్షాలు పడుతున్నాయి. రాత్రి నుంచి మొదలైన వర్షాలు తెరిపినివ్వడం లేదు. సోంపేటలో గరిష్టంగా పది సెంటీమీటర్ల వాన కురిసింది. ఈదురుగాలులకు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో భారీ వృక్షాలు నేలకూలాయి. ముందుజాగ్రత్త చర్యగా గురువారమే కరెంటు సరఫరాను నిలిపివేశారు. సహాయ సిబ్బంది, అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అందరినీ అప్రమత్తం చేస్తున్నారు.