bhadrachalam: భద్రాచలంలో ఈదురు గాలుల బీభత్సం!
- భారీ ఈదురు గాలులకు ఎగిరిపోయిన ఇళ్ల పైకప్పులు
- భద్రాచలం, దుమ్ముగూడెంలో నేలకొరిగిన చెట్లు
- నిలిచిపోయిన విద్యుత్ సరఫరా
తెలంగాణలోని భద్రాచలంలో ఈరోజు రాత్రి ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. భారీ ఈదురు గాలులకు ఇళ్ల పైకప్పులు ఎగిరిపోగా, భద్రాచలం, దుమ్ముగూడెం మండలంలోని పలుచోట్ల చెట్లు నేలకొరిగాయి. విద్యుత్ తీగలు తెగి స్తంభాలు కూలిపోవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
ఇదిలా ఉండగా, ‘ఫణి’ తుపాన్ ప్రభావం కారణంగా ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షంతో పాటు ఈదురుగాలులు బలంగా వీస్తున్నాయి. బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించారు. 126 పునరావాస కేంద్రాలకు 19,140 మందిని తరలించారు. జిల్లాలోని 12 మండలాల్లో ముందస్తుగా విద్యుత్ సరఫరా నిలిపివేశారు.