Somireddy Chandramohan Reddy: సోమిరెడ్డి సమీక్షలు నిర్వహించేందుకు అనుమతినిచ్చిన ఈసీ

  • సమీక్షలకు హాజరుకాని అధికారులు
  • కోడ్ కారణంగా గైర్హాజరు
  • తుపాను నేపథ్యంలో ఈసీ గ్రీన్ సిగ్నల్

ఏపీ వ్యవసాయశాఖా మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి ఎన్నికల కమిషన్ కోడ్ నుంచి మినహాయింపునిచ్చింది. ఫణి తుపాను నేపథ్యంలో గత రెండు రోజులుగా సోమిరెడ్డి నిర్వహించిన సమీక్షలకు అధికారులెవరూ హాజరు కాలేదు. ఎన్నికల కోడ్ ఉండటంతో అధికారులంతా గైర్హాజరయ్యారు.

తుపాను ప్రభావంతో పంట నష్టం, కరవు తదితర ప్రకృతి వైపరీత్యాలపై సమీక్ష నిర్వహించుకునేందుకు తాజాగా ఈసీ అనుమతి ఇచ్చింది. దీంతో రేపు సచివాలయంలోని తన ఛాంబర్‌లోనే సోమిరెడ్డి సంబంధిత శాఖాధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఈసీ అనుమితినిచ్చిన నేపథ్యంలో ఈ సమావేశానికి వ్యవసాయశాఖ, ఉద్యానవనశాఖ అధికారులతో పాటు ప్రత్యేక కమిషనర్లు కూడా హాజరు కానున్నారు.

Somireddy Chandramohan Reddy
Election Commission
Cyclone
Meeting
Agricultural Officers
  • Loading...

More Telugu News