Andhra Pradesh: మూడు వారాల్లో చంద్రబాబు పదవి ఊడిపోవడం ఖాయం: జీవీఎల్

  • ఊడిపోయే పదవిపై బాబుకు మమకారం తగ్గట్లేదు
  • పదవిలో ఉన్నంత కాలం దండుకోవాలని చూస్తున్నారు
  • ప్రతి దాన్నీ రాజకీయం చేయాలనుకోవడం తగదు

మూడు వారాల్లో చంద్రబాబు పదవి ఊడిపోవడం ఖాయమని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు జోస్యం చెప్పారు. ఢిల్లీలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, మూడు వారాల్లో ఊడిపోయే పదవిపై చంద్రబాబుకు మమకారం తగ్గట్లేదని ఎద్దేవా చేశారు. పదవిలో ఉన్నంత కాలం దండుకోవాలని చంద్రబాబు చూస్తున్నారని ఆరోపించారు.

చంద్రబాబు పాలనలో రైతులు కరవుతో అల్లాడినా పట్టించుకోలేదని విమర్శించారు. డ్రామాలు చేస్తున్న చంద్రబాబు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు. ఎన్నికల నియమావళిని రాజకీయం చేయాలని చంద్రబాబు చూస్తున్నారని, ఎన్నికల సంఘంతో చర్చించిన తర్వాతే కేంద్రం ఓ నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. ప్రతి దాన్నీ రాజకీయం చేయాలనుకుంటున్న చంద్రబాబుకు టెన్షన్ తప్ప ఒరిగేదేమీ లేదని అన్నారు. చంద్రబాబు తన సమీక్షల వల్ల ఏదో వెలగబెట్టినట్టు భావిస్తున్నారని, ఆయన చేస్తున్న ప్రకటనలు చూస్తుంటే అందరికీ నవ్వొస్తోందని వ్యాఖ్యానించారు.

Andhra Pradesh
cm
Chandrababu
bjp
gvl
  • Loading...

More Telugu News