Thirupatanna: బస్సులో కాల్పులు జరిపిన నిందితుడి కోసం గాలిస్తున్నాం: ఏసీపీ

  • నేటి ఉదయం బస్సులో కాల్పులు
  • వెనుక డోర్ నుంచి పరారైన నిందితుడు
  • ఎలాంటి స్పష్టతా రాలేదన్న ఏసీపీ

నేటి ఉదయం సికింద్రాబాద్ నుంచి ఫిలింనగర్ వెళ్లే బస్సులో గుర్తు తెలియని వ్యక్తి కాల్పులకు తెగబడిన విషయం తెలిసిందే. ఉదయం 10:45 గంటల సమయంలో బస్సు  పంజాగుట్ట వద్దకు రాగానే కాల్పులు జరిపి వెనుక డోర్ నుంచి దిగి వెళ్లి పోయాడు. అయితే ఆ కాల్పులు జరిపిన వ్యక్తి విషయంలో ఇంకా ఎలాంటి స్పష్టతా రాలేదని పంజాగుట్ట ఏసీపీ తిరుపతన్న తెలిపారు. బస్ కండక్టర్ భూపతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, నిందితుడి కోసం గాలిస్తున్నామని తిరుపతన్న పేర్కొన్నారు.

Thirupatanna
Bhupathi
Film Nagar
Secunderabad
Punjagutta
  • Loading...

More Telugu News