Andhra Pradesh: ఏ మీడియా సమావేశమైనా లోకేశ్ కోసం యామిని వస్తుంది!: వైసీపీ నాయకుడు సుధాకర్ బాబు

  • యనమలకి బదులుగా కుటుంబరావు వస్తారు
  • చంద్రబాబు సమాధానం చెప్పాల్సి వస్తే ఎవరొస్తారో?
  • ఆ యామినికి ఈ లోకేశ్ కు ఉన్న సంబంధం ఏమిటి?

ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి నిర్వహించే ఏ మీడియా సమావేశానికైనా లోకేశ్ కోసం యామిని వస్తుంది, యనమల రామకృష్ణుడుకి బదులుగా కుటుంబరావు వస్తారు, సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాల్సి వస్తే మరి ఎవరొస్తారో తమకు తెలియడం లేదని వైసీపీ నాయకుడు సుధాకర్ బాబు వ్యంగ్యంగా అన్నారు. అమరావతిలోని వైసీపీ కార్యాలయంలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఆ యామినికి, ఈ లోకేశ్ కు ఉన్న సంబంధం ఏమిటి? ఈమె ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకిలా పేట్రేగి మాట్లాడుతుందో? చిన్నవయసులోనే ఇంత అహం కారం ఎక్కడి నుంచి వచ్చిందో అంటూ నిప్పులు చెరిగారు. కన్నుమిన్నూ కానకుండా, చిన్నాపెద్దా లేకుండా ఆమె మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబుపై ఆయన విరుచుకుపడ్డారు. ఎన్నికల ఫలితాలు త్వరలో వెలువడనున్నాయని, చంద్రబాబుకు ఓటమి తప్పదని జోస్యం చెప్పారు.  

Andhra Pradesh
YSRCP
sudhakar babu
Telugudesam
Chandrababu
yamini
Yanamala
kutumbarao
  • Loading...

More Telugu News