Andhra Pradesh: ఏపీ ప్రజల డేటా చోరీ చేసి టీడీపీ నాయకులు డ్రామా లాడుతున్నారు: వైసీపీ నాయకుడు సుధాకర్ బాబు

  • ఐటీ గ్రిడ్ అశోక్ కు, లోకేశ్ కు ఉన్న సంబంధం ఏమిటి?
  • లోకేశ్ ఎందుకు వివరణ ఇవ్వడం లేదు?
  • సీబీఐతో ఎందుకు విచారణ జరిపించలేకపోయారు?

ఏపీ ప్రజల డేటా చోరీ చేసి.. టీడీపీ నాయకులు డ్రామా లాడుతున్నారని వైసీపీ నాయకుడు సుధాకర్ బాబు ఆరోపించారు. అమరావతిలోని వైసీపీ కార్యాలయంలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, డేటా చోరీ వ్యవహారాన్ని బట్టబయలు చేసింది తమ పార్టీయేనని అన్నారు. ఐటీ గ్రిడ్ సంస్థ అధినేత అశోక్ కు నారా లోకేశ్ కు ఉన్న సంబంధం ఏమిటి? ఈ విషయమై మీడియా ముందుకు వచ్చి లోకేశ్ ఎందుకు వివరణ ఇవ్వడం లేదు? అని ప్రశ్నించారు.

 డేటా చోరీ చేయించిదెవరు? డేటా దొంగలు ఎవరు? ఈ పాపంలో లోకేశ్ పాత్ర లేకపోతే సీబీఐతో ఎందుకు విచారణ జరిపించలేకపోయారు? అని ప్రశ్నించిన సుధాకర్ బాబు, ఈ విషయమై సమాధానం చెప్పాలని సీఎం చంద్రబాబును సూటిగా అడుగుతున్నానని అన్నారు. ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని ఎవరు దొంగిలించారన్న విషయాన్ని ఎనిమిది కోట్ల మంది ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు.

Andhra Pradesh
YSRCP
Telugudesam
Chandrababu
sudhakar babu
Nara Lokesh
IT GRID
  • Loading...

More Telugu News