Telangana: రోడ్లపై నిమ్మకాయ సోడా తాగుతున్నారా?.. అయితే ఈ వీడియో మీకోసమే!

  • హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ వద్ద ఘటన
  • ట్యాప్ వాటర్ ను వాడుతున్న యజమాని
  • సోషల్ మీడియాలో వీడియో వైరల్

ఏప్రిల్ వచ్చిందంటే చాలు ఎండలు దంచేస్తాయి. దీంతో కూల్ డ్రింకులు, సోడాలకు డిమాండ్ పెరిగిపోతుంది. ఈ సందర్భంగా సామాన్య ప్రజలు చాలామంది వీధుల్లో సోడాలు అమ్మే తోపుడు బండ్లను ఆశ్రయిస్తారు. నిమ్మకాయ సోడా కేవలం రూ.10 అయినప్పటికీ కనీసం స్వచ్ఛమైన మంచినీళ్లను ఈ సోడా కోసం వాడతారని భావిస్తారు. అయితే ఈ వీడియోను చూస్తే మాత్రం మీ నమ్మకాలు ఎగిరిపోతాయి. హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ సమీపంలో ఓ వ్యక్తి సోడా బండిని పెట్టుకున్నాడు.

అయితే సోడాలో వినియోగించే నీటి కోసం అతను అనుసరించిన మార్గం చూసిన ప్రజలు మాత్రం విస్తుపోయారు. ట్యాంక్ బండ్ సమీపంలో ఫ్లైఓవర్ దగ్గర మొక్కలకు నీళ్లు పడుతున్న ఓ మహిళ దగ్గరకు ఈ డబ్బాను తీసుకెళ్లి పెట్టాడు. దీంతో ఆమె ట్యాప్ నీటిని అందులో నింపింది. దాన్ని తీసుకొచ్చిన అతను సోడాలు అమ్ముకునేందుకు బయలుదేరాడు. ఎవరు తీశారో తెలియదు కానీ ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

  • Loading...

More Telugu News