geta arts: సినీ నిర్మాత అల్లు అరవింద్‌ సాయం: హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులకు మజ్జిగ బాటిళ్ల పంపిణి

  • మండే ఎండలో విధులు నిర్వహించే వారికి మా వంతు సాయమని ప్రకటన
  • దాహార్తి తీర్చడంతోపాటు ఆరోగ్యమని ఈ నిర్ణయం
  • నగరంలోని అన్ని ప్రాంతాల వారికి పంపిణి 

హైదరాబాద్‌ మహానగరంలో మండుటెండలో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్‌ పోలీసుల దాహార్తి తీర్చాలన్న లక్ష్యంతో తన వంతు సాయానికి ముందుకు వచ్చారు ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ అధినేత, చిరంజీవి బావమరిది అల్లు అరవింద్‌. హైదరాబాద్‌ నగరంలోని అన్ని ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు సీల్‌ చేసిన మజ్జిగ బాటిళ్లను అందిస్తున్నారు. వేసవిలో వడదెబ్బ తగలకుండా కాపాడేందుకు ట్రాఫిక్‌ పోలీసులతోపాటు జీహెచ్‌ఎంసీ కార్మికులకు కూడా ఈ బాటిళ్లు అందజేయనున్నట్లు తెలిపారు. మజ్జిగ దాహార్తిని తీర్చడంతోపాటు ఆరోగ్యాన్నిస్తుందని, ఈ మంచి పని చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందని గీతా ఆర్ట్స్‌ నిర్మాణ సంస్థ తన ట్విట్టర్‌లో పేర్కొంది.

geta arts
allu aravind
butermilk for trafic police
Hyderabad
  • Error fetching data: Network response was not ok

More Telugu News