Uppalapati Anuradha: ఆది, శ్రద్ధా శ్రీనాథ్ సినిమాపై వివాదం... పోలీసులను ఆశ్రయించిన ఉప్పలపాటి అనురాధ!

  • 'ఈడూ జోడు' పేరును 'జోడీ' చేశారు
  • నా సంతకం ఫోర్జరీ చేశారు
  • అనురాధ ఫిర్యాదుతో కేసు నమోదు

ఆది సాయికుమార్, శ్రద్ధా శ్రీనాథ్ హీరో, హీరోయిన్లుగా సత్యనారాయణ ప్రొడక్షన్స్ పేరిట తాను 'ఈడు జోడు' అనే చిత్రాన్ని నిర్మిస్తే, చిత్ర నిర్మాణంలో భాగస్వామి అయిన మరో మహిళా నిర్మాత దానిని చేజిక్కించుకోవడంతో పాటు రూ. 2 కోట్ల మేరకు తనకు నష్టం చేర్చారని ఆరోపిస్తూ, ఉప్పలపాటి అనురాధ బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించగా, కేసు నమోదైంది.

 మరిన్ని వివరాల్లోకి వెళితే, తాను సినిమాను ప్రారంభించిన తరువాత గుర్రం విజయలక్ష్మి వచ్చి సహ నిర్మాతగా చేరారని, అరిగెల విశ్వనాథ్ అనే దర్శకుడితో సినిమా తీశామని అనురాధ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. మార్చి 30న తన సంతకాలు ఫోర్జరీ చేసి, తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి, సినిమా పేరును 'జోడీ'గా మార్చి మీడియాకు ప్రకటన విడుదల చేశారని ఆరోపించారు.

బ్యానర్ పేరును కూడా మార్చారని, గుర్రం విజయలక్ష్మి తానే నిర్మాతగా ప్రకటించుకున్నారని తెలిపారు. దీంతో తనకు ఎంతో నష్టం కలిగిందని అనురాధ ఫిర్యాదు చేయగా, పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేసి, విచారణ ప్రారంభించారు.

Uppalapati Anuradha
eedu jodu
jodi
Movie
Police
  • Loading...

More Telugu News