Andhra Pradesh: దేవాన్ష్ తో గడపటానికి నాకు సమయం దొరకడం లేదు!: ఏపీ మంత్రి నారా లోకేశ్

  • దేవాన్ష్ వేగంగా ఎదిగిపోతున్నాడు
  • అతనితో ఉన్న కొన్ని క్షణాలు మైమరచిపోతా
  • ట్విట్టర్ లో స్పందించిన టీడీపీ నేత

ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేశ్ ఈరోజు తన కుమారుడు దేవాన్ష్ పై ప్రశంసలు కురిపించారు. దేవాన్ష్ చాలావేగంగా ఎదిగిపోతున్నాడని హర్షం వ్యక్తం చేశారు. దేవాన్ష్ తో గడిపేందుకు తనకు సమయం దొరకడం లేదని వ్యాఖ్యానించారు.

అయినా దేవాన్ష్ తో గడిపే కొన్ని క్షణాలు సమయాన్ని మర్చిపోతానని తెలిపారు. దేవాన్ష్ తో ఈ అద్భుతమైన జ్ఞాపకాలను కలకాలం గుర్తుంచుకుంటానని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. దీనికి దేవాన్ష్ తో దిగిన ఫొటోలను లోకేశ్ జతచేశారు.

Andhra Pradesh
Telugudesam
Nara Lokesh
devansh
Twitter
  • Loading...

More Telugu News