CLP leader: తెలంగాణ సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్కకు అస్వస్థత

  • జ్వరంతో ఖమ్మంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేరిక
  • వడదెబ్బ తగిలిందని ప్రకటించిన వైద్యులు
  • మూడు రోజులుగా ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్ర చేస్తున్న భట్టి

తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్‌ లెజిస్లేటివ్‌ పార్టీ (సీఎల్పీ) నాయకుడు, ఖమ్మం జిల్లా నాయకుడు మల్లు బట్టి విక్రమార్క అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారు. ఆయన తీవ్ర జ్వరంతో బాధపడుతూ ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌పై గెలిచి, అధికార పార్టీలో చేరుతున్న ఎమ్మెల్యేల తీరును నిరసిస్తూ వారి నియోజకవర్గాల్లో భట్టి విక్రమార్క మూడు రోజుల నుంచి ‘ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్ర’ చేస్తున్న విషయం తెలిసిందే. ఆయా నియోజక వర్గాల్లో సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయితే ఎండలు మండిపోతుండడంతో యాత్రలో ఆయనకు వడదెబ్బ తగిలిందని వైద్యులు ప్రకటించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని  తెలిపారు.

CLP leader
Mallu Bhatti Vikramarka
hospitalaised
  • Loading...

More Telugu News