Andhra Pradesh: చంద్రబాబూ.. అందుకే ప్రజలు ఈసారి నీ సీట్ మార్చబోతున్నారు!: కన్నా లక్ష్మీనారాయణ

  • బాబు ఉసరవెల్లి కంటే ఘోరంగా రంగులు మారుస్తారు
  • నిజాయతీగా పనిచేసే అధికారుల సీట్లనూ మారుస్తాడు
  • ట్విట్టర్ లో స్పందించిన బీజేపీ చీఫ్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై బీజేపీ ఏపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ తీవ్రంగా విరుచుకుపడ్డారు. చంద్రబాబు ఊసరవెల్లి కంటే ఘోరంగా రంగులు మారుస్తారనీ, నిమిషానికో మాట మారుస్తారని విమర్శించారు. అంతేకాకుండా నిజాయతీగా పనిచేసే అధికారుల సీట్లను కూడా మారుస్తారని ఎద్దేవా చేశారు.

ఎమ్మెల్యేలను కొనేసి వాళ్ల పార్టీలను కూడా మార్చేస్తున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అందుకే రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు సీటును ప్రజలు మార్చబోతున్నారని జోస్యం చెప్పారు.

కన్నా లక్ష్మీనారాయణ ఈరోజు ట్విట్టర్ లో స్పందిస్తూ..‘మోదీ గారు గంటకో డ్రెస్ మారుస్తారో లేదో తెలియదుగానీ..నువ్వు మాత్రం ఊసరవెల్లి కన్నా ఘోరంగా రంగులు మారుస్తావ్. నిమిషానికి ఒక మాట మారుస్తావ్. నిజాయితీగా ఉండే అధికారుల సీటు మారుస్తావ్. ఎమ్మెల్యేలను కొని వాళ్ళ పార్టీ మారుస్తావ్. అందుకే ప్రజలు ఈ ఎన్నికల్లో నీ సీట్ మారుస్తున్నారు. @ncbn’ అని ట్వీట్ చేశారు.

Andhra Pradesh
Chandrababu
Telugudesam
kanna
lakshmi narayana
BJP
Twitter
  • Loading...

More Telugu News